Part 3 Flashcards
కావ్య హేతువులగురించి ప్రప్రథమంగా ప్రస్తావించిన ఆలంకారికుడు ఎవరు?
భామహుడు
” ప్రజ్ఞా నవ నవాన్మేశశాలిని ప్రతిభామతా” అన్న లాక్షనికుడు?
భట్టతౌతుడు
” ప్రతిభా అపూర్వవస్తు నిర్మాణ క్షమా ప్రజ్ఞా” అన్నవారు ?
అభినవగుప్తుడు
” తస్యచ కారణం కవిగతా కేవలం ప్రతిభా” అన్నవారు?
జగన్నాథ పండితరాయలు
ప్రతిభయే కావ్య హేతువని ఉటంకించిన ఇద్దరు లాక్షణికులు ?
రాజశేఖరుడు, ఆనందవర్ధనుడు
” కావ్యంతు జాయతే జాతుకస్యచిత్ ప్రతిభావత: అన్నది ఎవరు?
భామహుడు
సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలలో మొట్టమొదటి లక్షణ గ్రంథం?
నాట్యశాస్త్రం
” న్యాయవాగేషుడు రాసిన అలంకార గ్రంథం ఏది?
అలంకార చంద్రిక
నిర్దోషము గుణాలంకార రసవంతమగు వాక్యం కావ్యము అన్నది?
భోజుడు
రసాలంకార యుక్తం సుఖవేశేష సాధనము అయినది కావ్యము అన్నది ఎవరు?
కేశవ మిత్రుడు
” దశరూపకాలలో ఏకాంకములు ప్రాచీనములు” అని అభిప్రాయపడినవారు ఎవరు? ఆ గ్రంథం ఏది?🔥🔥❤️
కె. వి. ఆర్ నరసింహం, సాహిత్య దర్శనం
” హాస్య ప్రధానమైన రూపకము?
ప్రహసనం
“కథానిక” ప్రస్తావన తెచ్చిన ఆది గ్రంథం?
అగ్ని పురాణం
రసము చేతనే సర్వకావ్యములు జీవించును. రసములేని కావ్యముండదు. “ రసధ్వని” యే కావ్యాత్మ అన్నది?🚩🚩🚩❤️❤️❤️
అభినవ గుప్తుడు
” రసేనైవ సర్వం జీవితి కావ్యం? అన్నవారు?
అభినవ గుప్తుడు
” కవిర్మనిషీ పరిభూత్ స్వయం భూ:” అని ఉటంకించిన ఉపనిషత్తు?
ఈశావాస్యోపనిషత్తు
” సాహిత్య దర్శనం” పేరుతో గ్రంథాలు రాసినవారు?
కె. వి. ఆర్ నరసింహం, కాటూరి వెంకటేశ్వరరావు
” సాహిత్య దర్శనం” పేరుతో వ్యాసాలు రాసినవారు?
కాటూరి వేంకటేశ్వరరావు
ప్రధమాంధ్ర విమర్శకుడు ఎవరు?
కందుకూరి వీరేశలింగం
తెలుగులో వెలువడిన తొలి నవలావిమర్శ గ్రంథం?
వివేక చంద్రికా విమర్శనము
” విమర్శకాగ్రేసర” బిరుదు ఎవరికీ కలదు?
కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
తొలి తులనాత్మక విమర్శ గ్రంథం ఏది? ఎవరు రాశారు?
మను వసుచరిత్ర రచనా విమర్శనము, వెన్నేటి రామచంద్రరావు
మహాభారత విమర్శకు “ నాంది” పలికినవారు?
వనప్పాకం అనంతాచార్యులు
” తెలుగులో సాహిత్య విమర్శ” పేరుతో గ్రంథాలు రాసిన ఇద్దరు?🔥🔥🔥❤️❤️❤️❤️
S.V రామారావు, పాటిబండ్ల మాధవ శర్మ